Par Panel That will Examine bill to Raise Legal Age of Marriage Has One Woman Member out of 31

Share this & earn $10
Published at : January 05, 2022

మహిళల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ.. కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన బిల్లును పరిశీలించేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీలో... ఓ మహిళకు మాత్రమే స్థానం లభించింది. 31 మంది సభ్యులతో పార్లమెంటరీ ప్యానెల్ ఏర్పాటుకాగా.... అందులో టీఎంసీకి చెందిన ఎంపీ సుస్మిత దేవ్ కు చోటు దక్కింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా... బాల్యవివాహాల నిరోధక సవరణ బిల్లును కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టింది. అనంతరం... బిల్లును విద్య, మహిళలు, చిన్నారులు, క్రీడలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపాలని... సభ నిర్ణయించింది. రాజ్యసభ వెబ్ సైట్ లోని సమాచారం ప్రకారం... భాజపా సీనియర్ నేత వినయ్ సహస్రబుద్ధ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బిల్లును పరిశీలించనుంది. మొత్తం 31 మందితో కూడిన కమిటీలో ఒక మహిళకు స్థానం దక్కగా... ప్యానెల్ లో మహిళా ఎంపీ సంఖ్య పెరిగితే బాగుంటుందని ఎంపీలు సుస్మితా దేవ్, సుప్రియా సూలే అభిప్రాయపడ్డారు.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
----------------------------------------------------------------------------------------------------------------------------- Par Panel That will Examine bill to Raise Legal Age of Marriage Has One Woman Member out of 31
ETVETV TeluguETV NewsVideo